Asian Champions Trophy 2024: మలేషియాను చిత్తు చేసిన భారత్.. సెమీఫైనల్‌కు అర్హత

Asian Champions Trophy 2024: మలేషియాను చిత్తు చేసిన భారత్.. సెమీఫైనల్‌కు అర్హత

గత నెలలో పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి ఔరా అనిపించిన భారత హాకీ జట్టు.. అదే ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఆసియా దేశాలు తలపడుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024లో సెమీస్‌కు అర్హత సాధించింది. బుధవారం(సెప్టెంబర్ 11) మలేషియాతో జరిగిన మూడో లీగ్  లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన 8-1 గోల్స్ తేడాతో విజయం సాధించి పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో భారత జట్టుకు ఇది వరుసగా మూడో విజయం. 

మ్యాచ్ ఏకపక్షం 

ఈ మ్యాచ్ అమాంతం ఏకపక్షంగా సాగింది. భారత ప్లేయర్లు వరుస పెట్టి గోల్స్ వేస్తూనే వచ్చారు. మలేషియా తరఫున అఖిముల్లా అనువార్ (34వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. భారత్ తరుపున రాజ్ కుమార్ పాల్ (3), అరైజీత్ సింగ్ హుండాల్ (2), జుగ్రాజ్ సింగ్ (1), హర్మన్‌ప్రీత్ సింగ్ (1), మరియు ఉత్తమ్ సింగ్ (1) గోల్స్ వేశారు.

Also Read :- నేటి నుంచి ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా టీ20 సిరీస్ 

మొత్తం ఆరు జట్లు తలపడుతున్న ఈ టోర్నీ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 17న ఫైనల్‌ జరగనుంది. ఇదిలావుంటే.. సెప్టెంబర్‌ 12న భారత జట్టు.. దక్షిణ కొరియాతో తలపడనుంది.

Also Read :- సెప్టెంబర్ 14, 15న ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్​ మూడో రౌండ్ పోటీలు

పాల్గొంటున్న 6 జట్లు

ఇండియా, చైనా, పాకిస్తాన్, మలేషియా, జపాన్, దక్షిణ కొరియా.