న్యూజిలాండ్తో తొలి వన్డేలో ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ విక్టరీ

న్యూజిలాండ్తో తొలి వన్డేలో ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ విక్టరీ

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌: బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో తేజల్‌‌‌‌‌‌‌‌ (42), దీప్తి శర్మ (41), యాస్తికా భాటియా (37) రాణించడంతో.. గురువారం జరిగిన తొలి వన్డేలో ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ 59 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ విమెన్స్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో టీమిండియా 1–0 లీడ్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. టాస్‌‌‌‌‌‌‌‌ గెలిచిన ఇండియా 44.3 ఓవర్లలో 227 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. షెఫాలీ వర్మ (33) ఫర్వాలేదనిపించింది.

అమెలియా కెర్‌‌‌‌‌‌‌‌ 4, జెస్‌‌‌‌‌‌‌‌ కెర్‌‌‌‌‌‌‌‌ 3, కార్సన్‌‌‌‌‌‌‌‌ 2 వికెట్లు తీశారు. తర్వాత కివీస్‌‌‌‌‌‌‌‌ 40.4 ఓవర్లలో 168 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. బ్రూకీ హాలిడే (39) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. మ్యాడీ గ్రీన్‌‌‌‌‌‌‌‌ (31), ప్లిమెర్‌‌‌‌‌‌‌‌ (21), లారెన్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌ (26), అమెలియా కెర్‌‌‌‌‌‌‌‌ (25 నాటౌట్‌‌‌‌‌‌‌‌) పోరాడి విఫలమయ్యారు. రాధా యాదవ్‌‌‌‌‌‌‌‌ 3, సైమా థాకోర్‌‌‌‌‌‌‌‌ రెండు వికెట్లు పడగొట్టారు. దీప్తికి ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరుగుతుంది.