- ఫైనల్లో 5-3తో పాకిస్తాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ
ఒమన్ : జూనియర్ హాకీ ఆసియా కప్‌లో ఇండియా కుర్రాళ్లు అదరగొట్టారు. అద్భుతమైన ఆటతీరుతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఐదోసారి ట్రోఫీని సొంతం చేసుకున్నారు. బుధవారం హోరాహోరీగా సాగిన టైటిల్ ఫైట్‌లో ఇండియా 5–3తో పాక్‌పై నెగ్గింది. ఇండియాకు ఇదో టైటిల్ కాగా, వరుసగా మూడోది. 2004, 2008, 2015, 2023లోనూ టీమిండియా టైటిల్స్‌ను సాధించింది. మూడు టైటిల్స్‌తో పాకిస్తాన్ రెండో ప్లేస్‌లో ఉంది. ఇండియా తరఫున అరైజిత్ సింగ్ హుందాల్ (4, 18, 47, 54వ ని) నాలుగు గోల్స్‌తో పాక్ పని పట్టాడు.
దిల్‌రాజ్ సింగ్ (19వ ని) అండగా నిలిచాడు. షాహిద్ హన్నన్ (3వ ని), సుఫియాన్ ఖాన్ (30, 39వ ని) పాక్‌కు గోల్స్ అందించారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఇండియా ఫార్వర్డ్స్ సూపర్ ఫీల్డ్ వర్క్ చూపెట్టారు. షార్ట్ పాస్‌లతో పాక్ శిబిరంలోకి చొచ్చుకుపోయి గోల్స్ చేసే చాన్స్‌లను సృష్టించారు. ఈ క్రమంలో వచ్చిన పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేసుకున్నారు. తొలి మూడు క్వార్టర్స్ ముగిసేసరికి ఇరుజట్లు 3–3తో సమంగా నిలిచాయి. కానీ చివరి క్వార్టర్లో అరైజిత్ సింగ్ పాక్ డిఫెన్స్ ఛేదించి ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టాడు.
Also Read : అండర్–19 ఆసియా కప్‌లో దుమ్మురేపిన సూర్యవంశీ ధనాధన్
ఇక స్కోరును సమం చేసేందుకు పాక్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఇండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. మూడో ప్లేస్ కోసం జరిగిన మ్యాచ్‌లో జపాన్ 2–1తో మలేసియాపై గెలిచింది. విన్నర్ టీమిండియాతో పాటు పాకిస్తాన్, మలేసియా, జపాన్, బంగ్లాదేశ్, చైనా, థాయ్‌లాండ్ వచ్చే ఏడాది ఇండియాలో జరిగే జూనియర్ హాకీ వరల్డ్ కప్ కు అర్హత సాధించాయి.