టీమ్ ఇండియా అదరగొట్టింది. తాజాగా వెల్లడించిన ఐసీసీ ర్యాంకుల్లో మూడు ఫార్మాట్లలో నంబర్ -1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది వరకు టెస్టుల్లో రెండో ర్యాంకులో ఉన్న భారత్.. ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ ను చిత్తు చేయడంతో టెస్టుల్లోనూ నంబర్ -1 ర్యాంకును కైవసం చేసుకుంది. టెస్టుల్లో 112, వన్డేల్లో 121, టీ20ల్లో 266 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో ఉంది.
ఆసీస్ ఇప్పుడు రెండవ స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ రెడ్-బాల్ ఫార్మాట్‌లో మూడో స్థానంలో ఉంది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ కూడా ఆరు విజయాలతో 68.51 పాయింట్ల శాతంతో అగ్రస్థానంలో ఉంది. డబ్ల్యూటీసీ సిరీస్‌లో భారత్‌కు ఇంకా ఐదు టెస్టులు ఉన్నాయంతే.
ఈ ఏడాది స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో భారీ తేడాతో గెలిస్తే టీమిండియా ఫైనల్ చేరే చాన్స్ ఉంది. కాగా రోహిత్ సేన సారథ్యంలోని టీమిండియా 4-1తో ఇంగ్లండ్ ను చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకుంది.