Success: ప్రపంచ ఐదో  ఆర్థిక వ్యవస్థగా భారత్

Success: ప్రపంచ ఐదో  ఆర్థిక వ్యవస్థగా భారత్

2015లో 2.1 ట్రిలియన్​ డాలర్లుగా ఉన్న భారతదేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 2025 నాటికి 4.3 ట్రిలియన్ల డాలర్లకు చేరింది. గత 10 ఏండ్లలో ఇండియా జీడీపీ 1‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌05 శాతం వృద్ధి చెందిందని ఐఎంఎఫ్​ పేర్కొన్నది. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ప్రకారం దశాబ్దకాలంలో భారత్​ 77 శాతం వృద్ధి నమోదు చేసింది.

2015లో 2.4 ట్రిలియన్ల డాలర్ల నుంచి 2025లో 4.3 ట్రిలియన్ల డాలర్లకు పెరిగింది. ఈ వేగవంతమైన వృద్ధి భారత్​ను ప్రపంచంలోని మొదటి ఐదు ఆర్థిక వ్యవస్థల్లో చేర్చింది. 2025లో జపాన్​ను అధిగమించి, 2027 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉన్నది. 

మిగతా దేశాల అభివృద్ధిని కూడా ఐఎంఎఫ్ విడుదల చేసింది. చైనా పదేండ్లలో 74 శాతం జీడీపీ వృద్ధిని సాధించింది. 2015లో 11.2 ట్రిలియన్ల డాలర్ల నుంచి 2025లో 19.5 ట్రిలియన్ల డాలర్లకు పెరిగింది. కోవిడ్​ మహమ్మారి, కొనసాగుతున్న ఆర్థిక సవాళ్ల నుంచి ఎదురు దెబ్బలతో చైనా అమెరికాను అధిగమించలేకపోయింది. అమెరికా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.

2015లో అమెరికా జీడీపీ 23.7 ట్రిలియన్ల డాలర్లు ఉండగా, 2025లో 30.3 ట్రిలియన్ల డాలర్లకు చేరింది. ఇది పదేండ్లలో 28శాతం వృద్ధిరేటును సూచిస్తుంది. టాప్ టెన్​ ఆర్థిక వ్యవస్థలు(అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, భారతదేశం, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, బ్రెజిల్)లో బ్రెజిల్ అత్యల్ప జీడీపీ వృద్ధిని నమోదు చేసింది. 2015లో 2.1 ట్రిలియన్ల డాలర్లు ఉన్న జీడీపీ 2025లో 2.3 ట్రిలియన్ల డాలర్లకు చేరింది.