IND vs ZIM 2024: టీ20ల్లో టీమిండియా అదరహో.. 150 విజయాలతో సరికొత్త చరిత్ర

IND vs ZIM 2024: టీ20ల్లో టీమిండియా అదరహో.. 150 విజయాలతో సరికొత్త చరిత్ర

జింబాబ్వే టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా వరుసగా రెండో విక్టరీ అందుకుంది. కెప్టెన్ శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ గిల్ (49 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 66), రుతురాజ్ గైక్వాడ్ (28 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్ల, 3 సిక్సర్లతో 49) మెరుపులకు తోడు బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుందర్ (3/15), అవేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2 /39) విజృంభించడంతో  బుధవారం జరిగిన మూడో టీ20లో  23  రన్స్ తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ మ్యాచ్ తో భారత క్రికెట్ జట్టు టీ20 క్రికెట్ లో 150 విజయాలను సొంతం చేసుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. 

2006లో టీ20 క్రికెట్‌లో తమ ప్రయాణాన్ని ప్రారంభించిన భారత్.. టీ20లో భారత్‌ ఇప్పటివరకు 230 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 150 విజయాలు సాధించిన మన జట్టు.. 69 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. 6 మ్యాచ్ ల్లో ఫలితం తేలలేదు. మరో 5 మ్యాచ్ లు టై గా ముగిసాయి. టీమిండియా తర్వాత పాకిస్తాన్ 142 విజయాలతో ఈ లిస్టులో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 111 విజయాలతో 3వ స్థానంలో నిలిచింది. ఐసీసీ అసోసియేట్ నేషన్స్‌పై భారత్ 100 శాతం విజయాల రికార్డును కలిగి ఉన్న ఏకైక జట్టుగా నిలిచింది. 

ఆస్ట్రేలియాపై అత్యధిక విజయాలు సాధించింది. కంగారులపై 32 మ్యాచ్ ల్లో 20 విజయాలు సాధించి టాప్ లో ఉంది. శ్రీలంకపై 29 మ్యాచ్ ల్లో 19.. వెస్టిండీస్ పై 30 మ్యాచ్ ల్లో 19 విజయాలు.. సౌతాఫ్రికాపై 27 మ్యాచ్ ల్లో 15 విజయాలు సాధించింది. దాయాది పాకిస్థాన్ పై 13 మ్యాచ్ ల్లో 9 మ్యాచ్ లను గెలిచింది. అన్ని జట్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. భారత్ ఈ నెలలో మరో 5 టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. జింబాబ్వేతో రెండు.. శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)