
దుబాయ్: ఇండియా బిగ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండో ఏడాది ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డుకు సూర్యను ఎంపిక చేసిన ఐసీసీ ఇండియా మిడిలార్డర్‌కు తను వెన్నెముక అని కొనియాడింది. గతేడాది షార్ట్ ఫార్మాట్‌లో సూపర్ పెర్ఫామెన్స్ చేసిన సూర్య 50 సగటు, 150 ప్లస్ స్ట్రయిక్ రేట్‌తో అదరగొట్టాడు. ప్రస్తుతం గజ్జల్లో గాయం నుంచి కోలుకుంటున్న సూర్య మార్చిలో ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.