
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్, సీపీఐ ఎం, సీపీఐ, డీఎంకే, ఆప్, ఆర్జేడీ, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) సీనియర్ నేతలు పాల్గొన్నారు. భేటీలో కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి పూర్తి మెజారిటీ సాధిస్తుందని నేతలు విశ్వాసం తో ఉన్నారు.
ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, శరద్ పవార్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, జార్ఖండ్ సీఎం చంపై సోరేన్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాకరే, సీపీఐ నేత డీ రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరీ,డీఎంకే నేత టీఆర్ బాలు, ఫరూక్ అబ్దుల్లా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతాబెనర్జీ, పీడీపీ నేత మహబూబా ముఫ్తీ డుమ్మా కొట్టారు.
#WATCH | Delhi | AAP leaders led by the party's national convenor Arvind Kejriwal arrive at the residence of Congress president Mallikarjun Kharge for the meeting of the INDIA alliance pic.twitter.com/TeSIObaudT
— ANI (@ANI) June 1, 2024
The INDIA alliance leaders' meeting at Congress President Shri @kharge’s residence in New Delhi today. pic.twitter.com/ykBQP4tSlI
— Congress (@INCIndia) June 1, 2024