న్యూఢిల్లీ: ఇప్పటికే చైనా యాప్స్‌పై నిషేధాస్త్రాన్ని సంధించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు యూట్యూబ్ ఛానెళ్లపై కొరడా ఝళిపించింది. 2021 ఐటీ రూల్స్ ను ఉల్లంఘిస్తున్నారన్న కారణాలతో 22 యూట్యూబ్ ఛానెల్స్, మూడు ట్విట్టర్ అకౌంట్స్, ఓ ఫేస్ బుక్ అకౌంట్, ఒక వార్తా వెబ్ సైట్ ను నిషేధించింది. యూట్యూబ్ ఛానెళ్లు, ట్విట్టర్ అకౌంట్స్, ఫేస్‌బుక్ అకౌంట్, న్యూస్ వెబ్‌సైట్ వివరాలను కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ యూట్యూబ్ ఛానెల్స్ జాతీయ భద్రత, విదేశాలతో భారత్ సంబంధాలకు సంబంధించి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నాయని.. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
I&B Ministry blocks 22 YouTube channels including 4 Pakistan-based YouTube news channels for spreading disinformation related to India’s national security, foreign relations, and public order.
— ANI (@ANI) April 5, 2022
3 Twitter accounts, 1 Facebook account & 1 news website also blocked pic.twitter.com/JtPC13MNHj
మోడీ సర్కార్ నిషేధించిన యూట్యూబ్ ఛానెళ్ల మొత్తం వ్యూయర్‌షిప్ 260 కోట్లకు పైగా ఉన్నట్లు తేలింది. వీటిలో 18 భారత్ కు చెందినవి, 4 పాకిస్తాన్‌కు చెందినవి. ఈ యూట్యూబ్ ఛానెల్స్ అన్నీ భారత సాయుధ బలగాలు, జమ్మూ కశ్మీర్ లాంటి అంశాలపై ఫేక్‌న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నాయి. ఇకపోతే, దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రతకు భంగం కలిగిస్తున్నాయన్న కారణాలతో ఇప్పటికే 320 యాప్స్‌ను కేంద్రం నిషేధించింది.
మరిన్ని వార్తల కోసం: