సౌతాఫ్రికాతో సిరీస్ క్లీన్ స్వీప్ తర్వాత భారత మహిళల జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూసుకుపోయింది. జూన్ 23న సౌతాఫ్రికాతో సిరీస్ ముగిసాక ఐసీసీ రివైజ్ చేసిన ర్యాంకింగ్స్ భారత మహిళా జట్టు ఒక స్థానం ఎగబాకి నాలుగో ర్యాంక్ సొంతం చేసుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ఇండియన్ టీం వచ్చే ఏడాది ODI వరల్డ్ కప్ ఎర్లీ ప్రిపరేషన్స్ లో అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనను ప్రదర్శించింది.
రివైజ్ చేసిన స్టాండింగ్స్ లో 163 రేటింగ్‌లతో ఆస్ట్రేలియా ICC ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ మరియు దక్షిణాఫ్రికా ర్యాంకింగ్స్‌లో తమ రెండు మరియు మూడవ స్థానాలను నిలుపుకున్నాయి.అయితే వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌ను 3-0తో ఓడించిన తర్వాత శ్రీలంక రెండు స్థానాలు ఎగబాకి ఐదవ స్థానాన్ని కైవసం చేసుకుంది. స్మ్రుతి మందాన రెండు సెంచరీలు, ఒక 90+ స్కోర్ చేసినప్పటికీ మూడో స్థానం నుండి నాలుగో స్థానానికి పడిపోయింది.కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా మూడు ఇన్నింగ్స్‌లలో 155 పరుగులు చేసి టాప్ టెన్ స్లాబ్ లోకి తిరిగి వచ్చింది.