
న్యూఢిల్లీ: ఇండియా బాక్సర్ జాదుమణి సింగ్ మండెంగ్‌బమ్ బ్రెజిల్‌లో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ లో సెమీఫైనల్ చేరుకున్నాడు. మంగళవారం (April 1) రాత్రి జరిగిన మెన్స్ 50 కేజీ క్వార్టర్ ఫైనల్లో జాదుమణి 3–-2 తేడాతో బ్రిటన్‌కు చెందిన ఎలిస్ ట్రోబ్రిడ్జ్‌పై విజయం సాధించాడు.
20 ఏండ్ల ఇండియా బాక్సర్ సెమీస్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఆసిల్‌బెక్ జలిలోవ్‌తో పోటీ పడనున్నాడు. ఇతర క్వార్టర్స్ లో నరేందర్ బర్వాల్ (+90 కేజీ)2-–3 తేడాతో సపర్‌బాయ్ (కజకిస్తాన్ ) చేతిలో పోరాడి ఓడగా, నిఖిల్ దూబే (75కేజీ) 0–-5 తేడాతో లోకల్ బాక్సర్ కౌ బెలినీ చేతిలో, జుగ్నూ (85 కేజీ) 1–-4 తో అబ్దులాయే ట్రావోరే (ఫ్రాన్స్) చేతిలో చిత్తయ్యారు.