
అమన్ (జోర్డాన్): ఇండియా బాక్సర్ అమన్ సివాచ్.. ఆసియా అండర్–15, 17 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన అండర్–17 మెన్స్ 63 కేజీ తొలి రౌండ్‌లో సివాచ్ 4–1తో అబుబాకిర్ దుయిషీవ్ (కిర్గిస్తాన్)పై నెగ్గాడు. హోరాహోరీగా సాగిన బౌట్‌లో తొలి రౌండ్‌లో కాస్త వెనకబడిన ఇండియన్ బాక్సర్ తర్వాత పుంజుకున్నాడు.
70 కేజీల్లో అన్షుల్ ఖాసా 0–5తో కుయానిష్ ఉరుంబస్సర్ (కజకిస్తాన్) చేతిలో ఓడాడు. ఆసియా బాక్సింగ్ నిర్వహించిన మొదటి ఈవెంట్ ఇది. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా, కొత్తగా ఏర్పడిన వరల్డ్ బాక్సింగ్ రెండూ ఈ టోర్నీని ఆమోదించాయి.