అసియా కప్ లో భాగంగా శ్రీలంకతో ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ కు ముందు భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కు పిలుపు వచ్చింది. నిన్న( సెప్టెంబర్ 15)న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తూ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. దీంతో శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్ కు అక్షర్ దూరమయ్యే అవకాశం ఉంది.
దీంతో అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు పిలుపు వచ్చింది. సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలోని శిక్షణ శిబిరంలో ఉన్నాడు. కాగా సుందర్ చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే ఆడాడు.
Nothing but respect for you, Axar Patel. ??? pic.twitter.com/81QRg19GxU
— Rajasthan Royals (@rajasthanroyals) September 15, 2023
ఇక వరుసగా రెండు విక్టరీలతో ఫైనల్ చేరి ఆసియా కప్ సూపర్–4 ఆఖరి మ్యాచ్‌లో ప్రయోగాలు చేసిన ఇండియాకు బంగ్లాదేశ్ ఝలక్ ఇచ్చింది. ఛేజింగ్‌లో శుభ్‌మన్ గిల్ ( 121) సూపర్ సెంచరీ, అక్షర్ పటేల్ (42) పోరాటంతో గెలుపు ముంగిట నిలిచిన టీమిండియాను పేసర్ ముస్తాఫిజుర్ (3/50) దెబ్బకొట్టాడు. దాంతో ఈ మ్యాచ్‌లో బంగ్లా 6 రన్స్ తేడాతో ఇండియాపై నెగ్గింది.