- ఆఖరాట వాన ఖాతాలోకి..
- ఇరు జట్లకు చెరో పాయింట్
–లాడర్‌హిల్స్ (ఫ్లోరిడా) : టీ20 వరల్డ్ కప్‌లో మరో మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. వర్షం కారణంగా గ్రూప్–ఎలో ఇండియా, కెనడా మధ్య శనివారం జరగాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దయ్యింది. ఆటకు ముందు కురిసిన వర్షం వల్ల గ్రౌండ్ చిత్తడిగా మారింది. ఔట్ ఫీల్డ్ చాలా ప్రాంతాల్లో తడిగా ఉండటంతో ఒక్క బాల్ కూడా సాధ్యపడలేదు. రెండుసార్లు గ్రౌండ్‌ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఆటను రద్దు చేశారు.ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
ప్రస్తుతం గ్రూప్–ఎలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఇండియా 7, అమెరికా 5 పాయింట్లతో సూపర్–8కు అర్హత సాధించాయి. కెనడా (3), పాకిస్తాన్ (2), ఐర్లాండ్ (1) ఇంటిదారి పట్టాయి. ఈ నెల 19 నుంచి జరిగే సూపర్–8 రౌండ్‌లో ఇండియా గ్రూప్–1లో బరిలోకి దిగనుంది. 20న జరిగే తొలి మ్యాచ్‌లో టీమిండియా.. అఫ్గానిస్తాన్‌తో తలపడుతుంది. 22న బంగ్లాదేశ్‌తో, 24న ఆస్ట్రేలియాతో పోటీ పడనుంది.