
న్యూఢిల్లీ: తన ఒత్తిడి వల్లే తమ దిగుమతులపై టారిఫ్స్‌ను తగ్గించేందుకు భారత్అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత అధికార వర్గాలు స్పందించాయి. సుంకాల్లో కోత విధించింది ట్రంప్‌కు భయపడి కాదని, అభివృద్ధి చెందుతున్న దేశాలతో వాణిజ్య సంబంధాల బలోపేతం కోసమని చెప్పాయి. ఇందులో భాగంగానే టారిఫ్‌లు తగ్గించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నాయి.
గతంలో కూడా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా ఆస్ట్రేలియా, యూఏఈ, స్విట్జర్లాండ్, నార్వేలాంటి దేశాలపై భారత్టారిఫ్లను తగ్గించిందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం యూరోపియన్యూనియన్, యూకేతో అగ్రిమెంట్కోసం చర్చలు జరుగుతున్నాయని తెలిపాయి. ఇదే క్రమంలో అమెరికాతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకే టారిఫ్‌లను తగ్గించాలని భారత్ నిర్ణయించిందని, ట్రంప్విధించిన గడువు సమీపిస్తున్నదనే భయంతో కాదని తేల్చి చెప్పాయి.
అన్ని ప్రొడక్ట్స్‌పై టారిఫ్ ఎత్తివేయాలన్న అమెరికా
అగ్రికల్చర్ప్రొడక్ట్స్మినహా అన్ని ఉత్పత్తులపై టారిఫ్‌ను ఎత్తేయాలని భారత్‌ను అమెరికా కోరింది. అమెరికాకు భారత్అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఫైనాన్షియల్ఇయర్లో ఇరుదేశాల మధ్య వాణిజ్యం 118.2 బిలియన్డాలర్లకు చేరకున్నది. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నది.