2025లో కొత్తగా 84 లక్షల డీమ్యాట్ ఖాతాలు .. ఏడాది లెక్కన 20 శాతం పెరుగుదల

2025లో కొత్తగా 84 లక్షల డీమ్యాట్ ఖాతాలు .. ఏడాది లెక్కన 20 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ: మనదేశ క్యాపిటల్​మార్కెట్లలోకి 2025 ఆర్థిక సంవత్సరంలో కొత్త ఇన్వెస్టర్లు భారీగా వచ్చారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ)లో 84 లక్షలకు పైగా కొత్త యాక్టివ్ డీమ్యాట్ ఖాతాలు రిజిస్టర్​ అయ్యాయి. ఇవి సంవత్సరానికి 20.5 శాతం పెరిగాయి. మొత్తం ఎకౌంట్ల సంఖ్య 4.92 కోట్లకు చేరుకుంది. కొత్త ఖాతాల్లో రెండు డిజిటల్ బ్రోకరేజ్‌‌‌‌‌‌‌‌లు - గ్రో,  ఏంజెల్ వన్ వాటా 57 శాతానికి పైగా ఉంది. గ్రో ఏకంగా 34 లక్షల కొత్త ఖాతాలను సంపాదించింది. 

మార్చి 2024లో 95 లక్షలుగా ఉన్న దాని యాక్టివ్ క్లయింట్ బేస్ మార్చి 2025 నాటికి 1.29 కోట్లకు పెరిగింది. ఇది వార్షికంగా 36 శాతం పెరిగింది. ఇదే కాలంలో గ్రో మార్కెట్ వాటా 23.28 శాతం నుంచి 26.26 శాతానికి పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరం ఏంజెల్ వన్ 14.6 లక్షల మంది కస్టమర్లను సంపాదించుకుంది. ఈ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్  యాక్టివ్ యూజర్ బేస్ 75.7 లక్షలకు పెరిగింది. దీని మార్కెట్ వాటా 15.38 శాతానికి చేరింది.