గౌతమ్ గంభీర్ ఖాతాలో మరో టైటిల్

లెజెండ్స్ క్రికెట్ లీగ్లో ఇండియా కాపిటల్స్ విజేతగా నిలిచింది. గౌతమ్‌ గంభీర్‌ సారథ్యంలోని ఇండియా క్యాపిటల్స్‌ బిల్వారా కింగ్స్‌ను 104 పరుగుల భారీ తేడాతో ఓడించింది. 

జాన్సన్ మెరుపులు..


మొదట బ్యాటింగ్ చేసిన  ఇండియా క్యాపిటల్స్.. 20 ఓవర్లలో 7 వికెట్లకు 211 పరుగుల భారీస్కోరు సాధించింది.  ఓ దశలో 21 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును..రాస్  టేలర్‌, జాన్సన్‌, నర్స్ లు ఆదుకున్నారు.  టేలర్ 41 బంతుల్లో 4ఫోర్లు, 8 సిక్స్‌లతో 82 పరుగులు చేయగా...  మిచెల్‌ జాన్సన్‌ 35 బంతుల్లో 7ఫోర్లు, 3సిక్స్‌లతో 62 రన్స్ కొట్టాడు. వీరిద్దరు 5వ వికెట్‌కు 126 పరుగులు జోడించారు. చివర్లో  ఆష్లే నర్స్‌  కేవలం19 బంతుల్లో 6ఫోర్లు, 1సిక్స్‌లతో 42 రన్స్ చేసి నాటౌట్ గా నిలవడంతో ఇండియా క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించింది. బిల్వారా బౌలర్లలో రాహుల్‌శర్మ 4 వికెట్లు సాధించగా.. మాంటీ పనేసర్‌ 2 వికెట్లు,  టిమ్‌ బ్రెస్నన్‌ ఒక వికెట్ దక్కించుకున్నారు. 

విఫలం..
ఆ తర్వాత 212 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బిల్వారా కింగ్స్..18.2 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది.  షేన్‌ వాట్సన్‌ 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌లతో 27 పరుగులు సాధించాడు. మిగతా వారంతా దారుణంగా విఫలమవడంతో..బిల్వారా కింగ్స్..ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. క్యాపిటల్స్‌ బౌలర్లలో ప్రవీణ్ తంబే, పంకజ్ సింగ్, పవన్ సుయాల్ చెరో రెండు వికెట్లు తీస్తే.. జాన్సన్‌, ప్లంకెట్‌,  రజత్‌ భాటియా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. సూపర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న రాస్ టేలర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.