
మహిళల ఆసియా కప్‌లో దాయాది పాకిస్థాన్ జట్టును హర్మన్‌ప్రీత్ బృందం చిత్తుచిత్తుగా ఓడించడంతో క్రికెట్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఫార్మాట్ ఏదైనా చిరకాల ప్రత్యర్థి జట్టును ఓడించడంలో ఉండే మజానే వేరని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తమ విజయానికి గల కారణాలు వివరించింది.
బౌలర్ల, బ్యాటర్ల ఉత్తమ ప్రదర్శనతో గెలిచామని చెప్పింది. కాగా గెలుపు క్రెడిట్ మాత్రం స్మృతి మంధాన, షెఫాలీ వర్మకు ఇవ్వాలని పేర్కొంది. వారిద్దరు విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును సునాయాసంగా గెలిపించారని తెలిపింది. మరోవైపు భారత్ ఆదివారం యూఏఈతో తదుపరి మ్యాచ్ ఆడనుంది.