Rohith Sharma : రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన

Rohith Sharma : రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన

రిటైర్మెంట్ వార్తలకు పుల్ స్టాప్ పెట్టాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ అవ్వడం లేదని చెప్పారు. ప్రస్తుతానికి తన దగ్గర ఫ్యూచర్ ప్లాన్ లేదన్నాడు.వరుసగా రెండు సార్లు టోర్నమెంట్ తమ జట్టు  విజేతగా నిలవడం గొప్ప విషయమన్నాడు.

ఈ టోర్నీలో ఆరంభం నుంచి మేం మెరుగ్గా ఆడాం. దానికి తగిన ఫలితం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ప్రారంభం నుంచే మా స్పిన్నర్లపై చాలా అంచనాలు ఉన్నాయి. వాళ్లు ఎప్పుడూ నిరాశపరచలేదు. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ టోర్నీలో మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ  కృతజ్ఞతలు. ఇది మా హోమ్ గ్రౌండ్ కాదు. అయినా అభిమానులు  దీన్ని మా హోమ్ గ్రౌండ్‌‌గా మార్చారు అని రోహిత్ అన్నాడు. 


చాంపియన్స్ ట్రోఫీలో అజేయ, అద్భుతమైన ఆటను కొనసాగించిన టీమిండియా అనుకున్నది సాధించింది. ఛేజింగ్‌‌‌‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (83 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 76) జట్టును ముందుండి నడిపించడంతో ముచ్చటగా మూడోసారి విజేతగా నిలిచింది.  ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో 4  వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌‌‌‌ను ఓడించి పుష్కరకాలం తర్వాత మళ్లీ ట్రోఫీని అందుకుంది.