ఇంగ్లండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది. అయితే మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ప్రీ-రికార్డెడ్ ఇంటర్వ్యూలో దినేష్ కార్తీక్‌తో మాట్లాడిన రోహిత్... ఒక రోజు నేను లేచిన తర్వాత బాగా ఆడడం లేదని ఫీల్ అయితే, ఆ రోజు కచ్ఛితంగా రిటైర్ అవుతాను.. కానీ గత కొన్నేళ్లుగా నేను నా జీవితంలో బెస్ట్ క్రికెట్ ఆడుతున్నా.. ఇప్పట్లో ఆ ఆలోచన అయితే లేదు అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఇప్పట్లో రోహిత్ రిటైర్మెంట్ లేదంటూ హిట్ మ్యాన్ ఫ్యాన్స్ సంబురపడుతున్నారు.
తాజాగా ధర్మశాలలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మూడో రోజు రోహిత్ శర్మ, వెన్ను నొప్పితో ఫీల్డింగ్‌కి రాలేదు. దీంతో జస్ప్రిత్ బుమ్రా స్టాండ్ బై కెప్టెన్‌గా మ్యాచ్‌ని ముగించేశాడు. కాగా రోహిత్ రిటైర్మెంట్ పై గతంలో కూడా పలుమార్లు వార్తలు వచ్చాయి.
ALSO READ :- BAN vs SL: జూనియర్ మలింగ హ్యాట్రిక్.. ముంబై ఇండియన్స్‌కు ఆ లోటు తీరినట్టే
ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ లో రోహిత్ శర్మ రెండు సెంచరీలు చేశాడు. 5 మ్యాచుల్లో 400 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. 55 టెస్టుల్లో 45.57 సగటుతో 4085 పరుగులు చేసిన రోహిత్ శర్మ, 12 సెంచరీలు నమోదు చేశాడు