
లండన్: ఎఫ్‌ఐహెచ్ ప్రో హాకీ లీగ్‌లో ఇండియా మెన్స్ టీమ్ సంచలన విజయం సాధించింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 3–0తో వరల్డ్ చాంపియన్స్ జర్మనీకి షాకిచ్చింది. ఇండియా తరఫున డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ (16వ ని), సుక్జీత్ సింగ్ (41వ ని), గుర్జాంత్ సింగ్ (44వ ని) గోల్స్ చేశారు. ఆదివారంగ్రేట్ బ్రిటన్‌తో ఇండియా పోటీ పడనుంది.