
న్యూఢిల్లీ: భారత్‌కు అమెరికా నుంచి వస్తున్న యూఎస్ ఎయిడ్ నిధులపై ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత్ చేపట్టిన దాదాపు రూ.6,498 కోట్ల 93 లక్షల 7 వేల 500 (750 మిలియన్ డాలర్స్) విలువైన ఏడు ప్రాజెక్టులకు యూఎస్ఎయిడ్ నిధులు అందినట్టు రిపోర్ట్‌లో తెలిపింది. ఈ ప్రాజెక్టులను అమెరికా భాగస్వామ్యంతో భారత్ చేపట్టిందని పేర్కొంది. ఇందులో అమెరికా రూ.825 కోట్లు (97 మిలియన్ డాలర్లు) కేటాయించినట్టు వెల్లడించింది. ఈ ఏడాది పోలింగ్‌శాతాన్ని పెంచేందుకు ఎలాంటి నిధులు కేటాయించలేదని తెలిపింది.