
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ బెర్తు అందుకున్న తర్వాతి రోజే ఇండియా సర్ఫింగ్ జట్టు సత్తా చాటింది. ఆసియా సర్ఫింగ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్‌తో మెరిసింది. ఆదివారం మాల్దీవ్స్‌లోని తులస్ధూ ద్వీపంలో జరిగిన ఈ టోర్నీ టీమ్ ఈవెంట్ అయిన మరుహబా కప్‌లో చైనీస్ తైపీ, చైనాను వెనక్కునెట్టి పతకం గెలిచింది. కమలి, అజీష్ అలీ, శ్రీకాంత్, సంజయ్ సెల్వమణిలతో కూడిన ఇండియా ఫైనల్లో 24.13 టీమ్ స్కోర్‌తో రెండో స్థానం సాధించింది. జపాన్ 58.40 స్కోరుతో బంగారు పతకాన్ని గెలుచుకుంది. చైనీస్ తైపీ (23.93) కాంస్యం అందుకుంది.