పల్లెకెలె: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న ఇండియా.. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లోనూ 7 వికెట్ల తేడాతో (డక్ వర్త్ లూయిస్) గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. టాస్ ఓడిన లంక 20 ఓవర్లలో 161/9 స్కోరు చేసింది. కుశాల్ పెరీరా (53) టాప్ స్కోరర్. పాథుమ్ నిశాంక (32), కామిందు మెండిస్ (26), చరిత్ అసలంక (14), రమేశ్ మెండిస్ (12) ఓ మాదిరిగా ఆడారు.
రవి బిష్ణోయ్ 3, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్, హార్దిక్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో ఇండియా టార్గెట్‌ను 8 ఓవర్లలో 78 రన్స్‌గా మార్చారు. ఛేజింగ్‌లో ఇండియా 6.3 ఓవర్లలోనే 81/3 స్కోరు చేసి గెలిచింది. శాంసన్ (0) డకౌటైనా, యశస్వి జైస్వాల్ (30), సూర్య (26) రెండో వికెట్‌కు 39 రన్స్ జత చేశారు. హార్దిక్ పాండ్యా (22) భారీ హిట్టింగ్‌తో ఈజీగా గెలిపించాడు. బిష్ణోయ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 మంగళవారం జరుగుతుంది.