పాకిస్తాన్ విమానాలు ఎక్కినోళ్లు ఇక సచ్చారే : చైనా, శ్రీలంక చుట్టూ తిరిగి పోవాలి..?

పాకిస్తాన్ విమానాలు ఎక్కినోళ్లు ఇక సచ్చారే : చైనా, శ్రీలంక చుట్టూ తిరిగి పోవాలి..?

ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!
పాక్ విమానాలకు నో పర్మిషన్?
కీలక నిర్ణయం దిశగా సర్కారు

ఢిల్లీ: పహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రికత్తలు నెలకొన్న విషయం తెలిసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ తమ గగనతలంలోకి ఇండియా విమానాల రాకపోలను నిషేధించింది. వారం రోజులు ఓపిక పట్టిన భారత్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రతీకార చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పాక్ విమానాలను భారత గగన తలం నుంచి వెళ్లకుండా నిషేధించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అన్ని పాక్  విమానయాన సంస్థలకు చెందిన విమానాలను నిషేధిస్తూ భారత గగనతలాన్ని మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.   

దీనిపై భారత్‌ నిర్ణయం తీసుకుంటే.. అది పాక్‌ ఎయిర్‌లైన్లపై పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది. పాక్‌ విమానాలు కౌలాలంపూర్‌ సహా మలేసియాలోని ఇతర నగరాలు, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే మన గగనతలాన్ని దాటాల్సిందే.ఇప్పుడు భారత్‌ నిషేధం విధిస్తే.. దక్షిణాసియా ప్రాంతాలకు వెళ్లేందుకు చైనా లేదా శ్రీలంక మీదుగా విమానాలను మళ్లించాల్సి ఉంటుంది. 

►ALSO READ | బయటపడిన పాక్ కుట్ర.. ఉగ్రవాదుల్లో ఒకరు పాక్ ఆర్మీలో.. ఒకప్పుడు పారా కమాండోనే..!

అప్పుడు ప్రయాణసమయం పెరగడంతో పాటు నిర్వహణ పైనా అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్‌ ఎయిర్‌లైన్లకు ఇది మరింత ఇబ్బందికరంగా మారనుంది.