![క్వార్టర్స్‌లోనే ఇండియా ఖేల్ ఖతం](https://static.v6velugu.com/uploads/2025/02/india-crash-out-of-badminton-asia-mixed-team-championships-after-losing-to-japan_0OCtvuIReq.jpg)
కింగ్‌దావో (చైనా): ఆసియా మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఇండియా క్వార్టర్ ఫైనల్లోనే ఓడి పతకం లేకుండా ఇంటిదారి పట్టింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులో 0–3తో జపాన్ చేతిలో పరాజయం పాలైంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో 37వ ర్యాంకర్స్ ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో 13–21, 21–17, 13–21తో 12వ ర్యాంకర్స్ హిరోకి మిదొరికవా–నత్సు సైతో చేతిలో మూడు గేమ్స్ పాటు పోరాడి ఓడిపోయింది.
పీవీ సింధు గైర్హాజరీలో విమెన్స్ సింగిల్స్‌లో బరిలో నిలిచిన 31వ ర్యాంకర్ మాళవిక బన్సొద్ 12–21, 19–21తో 8వ ర్యాంక్ షట్లర్ టొమొకా మియజకి చేతిలో చిత్తయింది. కచ్చితంగా నెగ్గాల్సిన మెన్స్ సింగిల్స్‌లో సీనియర్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ 14–21, 21–15, 12–21తో కెంటా నిషిమోటో చేతిలో ఓడాడు.