Asian Para Games 2023: పారా గేమ్స్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. మెడల్స్‌లో తొలిసారి సెంచరీ

Asian Para Games 2023: పారా గేమ్స్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. మెడల్స్‌లో తొలిసారి సెంచరీ

ఆసియా పారా గేమ్స్ లో భారత్ ఆటగాళ్లు మెరిశారు. అద్భుత ఆట తీరుతో పతకాల వర్షం కురిపించారు. తొలిసారి 100 పతకాలు సాధించి అరుదైన చరిత్ర సృష్టించింది. చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఈ  క్రీడల్లో అథ్లెట్‌ దిలీప్‌ మహదు గవిత్‌ గోల్డ్ మెడల్ గెలిచి మెడల్స్ సంఖ్యను 100 కు చేర్చాడు.

పురుషుల 400 మీటర్ల పరుగును 49.48 సెకన్లలో పూర్తి చేసిన దిలీప్‌.. తన పేరును భారత పారా గేమ్స్ లో ‘సువర్ణా’క్షరాలతో లిఖించుకున్నాడు. పారా క్రీడల్లో భారత్‌ ఇప్పటి వరకు 29 పసిడి, 31 రజత, 51 కాంస్యాలతో మొత్తం 111 పతకాలు కైవసం చేసుకొని ఐదో స్థానంలో నిలిచింది. భారత్ పారా క్రీడల్లో 100 కు పైగా మెడల్స్ సాధించడం ఇదే తొలిసారి. జకార్తాలో జరిగిన 2018 పారా గేమ్స్‌లో భారత్ అత్యధిక పతకాలు గెలుచుకుంది. 

ఈ క్రీడల్లో  మొత్తం 15 స్వర్ణాలు, 24 రజతాలు, 33 కాంస్యాలతో 72 పతకాలు సాధించారు.ఇక చైనా ఆతిధ్య చైనా 2023 ఆసియా గేమ్స్ లో   మొత్తంగా 521 మెడల్స్‌(214 స్వర్ణాలు, 167 వెండి, 140 కంచు) తో గెలిచి ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా.. 131 పతకాలతో ఇరాన్‌ రెండో స్థానంలో నిలిచింది. ఆసియా పారా క్రీడల్లో తొలిసారిగా భారత క్రీడాకారులు 100 పతకాలు గెలవడంతో ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పారా అథ్లెట్ల కఠిన శ్రమ, అంకిత భావం కారణంగానే సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైందని పేర్కొన్నారు.

Also Read :- గల్లీ క్రికెట్ అనుకున్నావా బాబర్