దేశంలో 25 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో క‌రోనా కేసులు గత వారం రోజుల నుంచి 60 వేలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా 65,002 కరోనా కేసులు న‌మోద‌య్యయని కేంద్ర కుటుంబ మరియు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25,26,193కు చేరుకుంది. ఇందులో 18,08,937 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మ‌రో 6,68,220 కేసులు యాక్టివ్‌గా ఉన్న‌ట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వల్ల శుక్రవారం 996 మంది మ‌ర‌ణించారు. దాంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మరణించిన వారిసంఖ్య 49,036కు చేరింది. దేశంలో ప్ర‌తిరోజు పాజిటివ్ కేసులు భారీగా న‌మోద‌వుతున్న‌ప్ప‌టికీ, కోలుకుంటున్న ‌వారిసంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతున్న‌ది. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 70.76 శాతానికి చేరుకోగా.. మ‌ర‌ణా‌ల రేటు 1.98 శాతంగా ఉంది.

నిన్నటివరకు దేశంలో 2,85,63,095 కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. నిన్న ఒక్కరోజే 8,68,679 శాంపిళ్లను టెస్ట్ చేసినట్లు తెలిపింది.

For More News..

రాష్ట్రంలో 90 వేలు దాటిన కరోనా కేసులు

పన్నులు కట్టేది 1.5కోట్ల మంది! ఐటీఆర్ వేసేది 6.5కోట్ల మంది

ఇంట్లో నలుగురు మృతి.. ఒక్కోచోట ఒక్కొక్కరి మృతదేహం