కరోనా కేసులు దేశంలో రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా కరోనా కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది. గత 24 గంటల్లో అత్యధికంగా 49,931 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,35,453కు చేరింది. వీటిలో 4,85,114 కేసులు యాక్టివ్ గా ఉండగా.. 9,17,568 మంది కరోనా బారినపడి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 708 మంది మరణించారు. దాంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 32,771కు చేరుకుంది. ఐసీఎంఆర్ ప్రకారం.. ఆదివారం 5,15,472 శాంపిళ్లను పరీక్షించారు. దాంతో మొత్తం శాంపిళ్ల సంఖ్య 1,68,06,803కు చేరుకుంది. కాగా.. జూలై 25న 13 లక్షల మార్క్ ను దాటిన భారత్.. రెండు రోజుల్లోనే మరో లక్ష కేసులను చేరుకోవడం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.
For More News..