విమెన్స్‌‌ జూనియర్‌‌‌‌ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌‌లో ఫైనల్లో ఇండియా

విమెన్స్‌‌ జూనియర్‌‌‌‌ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌‌లో ఫైనల్లో ఇండియా
  •     నేడు చైనాతో తుదిపోరు

మస్కట్‌‌ : విమెన్స్‌‌ జూనియర్‌‌‌‌ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌‌లో ఇండియా ఫైనల్‌‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్‌‌ ఇండియా 3–1తో జపాన్‌‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి విజేతగా నిలిచేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్‌‌లో ఇండియా ఆరంభం నుంచే విజృంభించింది.  తొలి క్వార్టర్‌‌‌‌లోనే మూడు గోల్స్‌‌ కొట్టి ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టింది.  

ముంతాజ్‌‌ ఖాన్ 4వ నిమిషంలో తొలి గోల్ సాధించగా.. తర్వాతి నిమిషంలోనే సాక్షి రాణా రెండో గోల్‌‌ అందించింది. 13వ నిమిషంలో దీపిక కొట్టిన గోల్‌‌తో ఇండియా ఆధిక్యం మూడింతలైంది. జపాన్ తరఫున నికో మరుయమ (23వ ని) ఏకైక గోల్ సాధించింది. మరో సెమీస్‌‌లో చైనా4–1తో కొరియాను  ఓడించి ఆదివారం ఇండియాతో టైటిల్ ఫైట్‌‌కు రెడీ అయింది.