Asian Champions Trophy 2024: పాకిస్థాన్‌ను చిత్తుచేసిన భారత్.. వ‌రుస‌గా ఐదో విజ‌యం

Asian Champions Trophy 2024: పాకిస్థాన్‌ను చిత్తుచేసిన భారత్.. వ‌రుస‌గా ఐదో విజ‌యం

ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. శనివారం(సెప్టెంబర్ 14) పాకిస్థాన్‌తో జరిగిన తమ చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా 2-1 తేడాతో విజయం సాధించింది. భారత్ తరుపున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 13వ, 19వ నిమిషంలో గోల్స్ వేయగా.. పాక్ తరుపున నదీమ్ అహ్మద్(8వ నిమిషంలో) ఏకైక గోల్ వేశాడు. ఈ టోర్నీలో భారత జట్టుకు వరుసగా ఐదో విజయం. ఇప్పటికే సెమీస్ చేరిన భారత్ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. 

Also read : మనోళ్లు మొదలెట్టారు..బంగ్లాతో టెస్ట్ సిరీస్ కు ప్రాక్టీస్ షురూ

ఎనిమిదేళ్లుగా ఓటమన్నదే లేదు

2016 సౌత్ ఆసియా గేమ్స్ ఫైనల్ మొదలుకొని ఇప్పటివరకూ భారత హాకీ జట్టు.. పాకిస్తాన్ చేతిలో ఓడిందే లేదు. అప్పటి నుండి ఇప్పటివరకూ ఇరు జట్లు 17 సార్లు తలపడగా.. భారత్ 15 విజయాలు సాధిచింది. మిగిలిన రెండు డ్రాగా ముగిశాయి.