
న్యూఢిల్లీ: డొమెస్టిక్ క్రికెట్‌లో మేటి క్రికెటర్లుగా పేరుతెచ్చుకున్న ఐదుగురు ఆటగాళ్లు తమ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగిన బెంగాల్ లెజెండ్ మనోజ్ తివారీ, జార్ఖండ్ బిగ్ హిట్టర్ సౌరభ్ తివారీ, అదే రాష్ట్రానికి చెందిన పేసర్ వరుణ్ ఆరోన్, ముంబై స్టార్ ధవళ్ కులకర్ణి, విదర్భ రంజీ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్ ఫయాజ్ ఫజల్ ఆటకు గుడ్‌బై చెప్పారు. ఈ ఐదుగురికి ఐపీఎల్, టీమిండియా కాంట్రాక్ట్ లేదు. దాంతో రాజకీయాలు సహా ఇతర మార్గాల్లో ముందుకెళ్లేందుకు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఆరోన్, మనోజ్, ఫయాజ్ తమ కెరీర్‌ను మొదలెట్టిన స్టేడియంలోనే ముగింపు పలకడం విశేషం.