ముంబై: ఆస్ట్రేలియా విమెన్స్‌తో గురువారం మొదలైన ఏకైక టెస్ట్‌లో తొలి రోజు ఇండియా ఆధిపత్యమే నడిచింది. బౌలింగ్‌లో పూజా వస్త్రాకర్ (4/53), స్నేహ్ రాణా (3/56), దీప్తి శర్మ (2/45) చెలరేగడంతో.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 77.4 ఓవర్లలో 219 రన్స్‌కు ఆలౌటైంది. తహ్లియా మెక్‌గ్రాత్ (50), బెత్ మూనీ (40), కెప్టెన్ అలీసా హీలీ (38) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. తొలి రెండు ఓవర్లలో ఫోబే లిచ్‌ఫీల్డ్ (0), ఎలీసా పెర్రీ (4)ని ఔట్ చేయడంతో కంగారూలు 7/2తో కష్టాల్లో పడ్డారు.
ఈ దశలో మెక్‌గ్రాత్, బెత్ మూనీ మూడో వికెట్‌కు 80 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. మెక్‌గ్రాత్ 24, 45 స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌లను డ్రాప్ చేసిన ఇండియా రెండో సెషన్‌లో బాగా పుంజుకుంది. వరుస విరామాల్లో అన్నాబెల్ సదర్లాండ్ (16), గార్డెనర్ (11), జెస్ జొనాసెన్ (19), అలనా కింగ్ (5)ను ఔట్ చేసి మ్యాచ్‌పై పట్టు బిగించారు. చివర్లో కిమ్ గారెత్ (28 నాటౌట్) బ్యాట్ ఝుళిపించడంతో ఆసీస్ స్కోరు 200 దాటింది.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో 98/1 స్కోరు చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (40), స్మృతి మంధాన (43 బ్యాటింగ్) తొలి వికెట్‌కు 90 రన్స్ జోడించి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. మంధానాతో పాటు స్నేహ్ రాణా (4 బ్యాటింగ్) క్రీజులో ఉంది. ప్రస్తుతం టీమిండియా ఇంకా 121 రన్స్ వెనకబడి ఉంది.