టెస్ట్ ర్యాంకింగ్స్‌‌లో నాలుగో ప్లేస్‌కి పడిపోయిన ఇండియా

4వ ప్లేస్‌‌కు పడిపోయిన ఇండియా

దుబాయ్‌‌: ఇంగ్లండ్‌‌తో ఫస్ట్ టెస్టులో ఓటమితో వరల్డ్‌‌ టెస్ట్ చాంపియన్‌‌షిప్‌‌ ర్యాంకింగ్స్‌‌లో ఇండియా టాప్‌‌ ప్లేస్‌‌ నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్‌‌లో విజయంతో ఇంగ్లండ్‌‌ అగ్రస్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియాపై సిరీస్‌‌ విక్టరీ తర్వాత టీమిండియా అగ్రస్థానం సాధించింది. కానీ, ఒక్క ఓటమితో 68.3 పర్సంటేజ్‌‌ పాయింట్లతో నాలుగో ప్లేస్‌‌కు దిగజారింది. ఇండియా ఫైనల్‌‌ చేరాలంటే ఈ సిరీస్‌‌లో 3–0 లేదా 2–1తో విజయం సాధించాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లండ్‌‌ (70.2 పర్సంటేజ్‌‌ పాయింట్స్‌‌) ఫైనల్‌‌ చాన్సెస్‌‌ను మెరుగు పరుచుకుంది. ఈ సిరీస్‌‌ను 4–0,  3–0 లేదా 3–1తో గెలిస్తే ఈ జట్టు ఫైనల్‌‌కు క్వాలిఫై అవుతుంది. సెకండ్‌‌ ప్లేస్‌‌లో ఉన్న న్యూజిలాండ్‌‌ (70.0) ఇప్పటికే తుదిపోరుకు అర్హత సాధించింది.

For More News..

రోడ్డెక్కితే కుక్కలు కరుస్తున్నయ్..

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ముందంజ