ఆసియా క్రీడల్లో పతకం ఖాయం చేసుకున్న భారత హాకీ టీం.. సెమీస్‌లో కొరియా చిత్తు

ఆసియా క్రీడల్లో పతకం ఖాయం చేసుకున్న భారత హాకీ టీం.. సెమీస్‌లో కొరియా చిత్తు

ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. తాజాగా మరో పతకాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన ఆసియా క్రీడల్లో భారత  పురుషుల హాకీ జట్టు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో 5-3తో రిపబ్లిక్ ఆఫ్ కొరియాను ఓడించి ఫైనల్ కి చేరుకుంది. దీంతో భారత హాకీ జట్టు ఫైనల్లో ఓడినా సిల్వర్ మెడల్ అయిన దక్కుతుంది.
 
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. హార్దిక్ సింగ్ (5’), మన్‌దీప్ సింగ్ (11’), లలిత్ కుమార్ ఉపాధ్యాయ (15’), అమిత్ రోహిదాస్ (24’), అభిషేక్ (54’) గోల్స్ చేసి భారత తరపున గోల్స్ చేసి ఫైనల్‌కు చేర్చారు. దక్షిణ కొరియా తరఫున జంగ్ మాంజే (17’, 20’, 42’) హ్యాట్రిక్ సాధించిన ప్రయోజనం లేకుండా పోయింది. శుక్రవారం జరిగే గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు చైనా, జపాన్‌ల మధ్య జరిగే మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌ విజేతతో తలపడనుంది..

ALSO READ : జీమెయిల్లో మరో అద్బుత ఫీచర్.. ఎమోజీలతో పండగే పండగ..

ఒకవేళ ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే ఆసియా క్రీడల్లో భారత్‌కు నాల్గవ పురుషుల హాకీ స్వర్ణ పతకాన్ని సాధించడమే కాకుండా హర్మన్‌ప్రీత్ సింగ్ అండ్ కోకు పారిస్ 2024 ఒలింపిక్ బెర్త్‌ను కూడా ఖాయం చేస్తుంది. ఈ నేపథ్యంలో భారత పురుషుల హాకీ టీం స్వర్ణం గెలుస్తుందో లేదో చూడాలి.