
న్యూఢిల్లీ: మనదేశ వంట నూనెల దిగుమతి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఏడాది లెక్కన 8 శాతం తగ్గి 8,85,561 టన్నులకు చేరుకుందని సాల్వెంట్ఎక్స్ట్రాక్టర్స్అసోసియేషన్ఆఫ్ఇండియా (ఎస్ఈఏ) వెల్లడించింది. ఫిబ్రవరిలో వంట నూనె, ఇతర నూనెల దిగుమతులు 7 శాతం తగ్గి 8,99,565 టన్నులకు చేరుకున్నాయి. గత ఫిబ్రవరిలో 9,65,852 టన్నుల నూనె దిగుమతి అయింది. ఇందులో 8,85,561 టన్నుల వంటనూనెలు, 14,004 టన్నుల ఇతర నూనెలు ఉన్నాయి.
కరోనా కారణంగా 2020 మేలో దిగుమతులు 7,20,976 టన్నులకు పడిపోయాయి. ఆ తరువాత ఇంతలా పడిపోవడం ఇదే మొదటిసారని ఎస్ఈఏ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2024–-25 చమురు మార్కెటింగ్ సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో మొత్తం వంటనూనె దిగుమతులు 48,07,798 టన్నులకు చేరుకున్నాయి.