మొబైల్ ఫోన్ల తయారీలో వరల్డ్ టాప్ 2 భారత్

మొబైల్ ఫోన్ల తయారీలో వరల్డ్ టాప్ 2 భారత్

మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం. స్మార్ట్ ఫోన్ల తయారీ, ఎగుమతుల్లో భారత్ గణనీయమైన వృద్ధిని సాధించి వరల్డ్ టాప్ 2 లో నిలిచింది. ఇండియాకు చెందిన ఒరిజినల్ ఎక్విప్ మెంట్స్ తయారీదారులు(OEMలు, ఒరిజినల్ డిజైన్ తయారీ దారులు (ODMలు), కంపెనీలనుంచి మొబైల్ ఫోన్ తయారీ రంగంలో గణీనీయమైన పెట్టుబడులు పెట్టినట్లు ఇటీవల వెల్లడైన నివేదికలు చెబుతున్నాయి. 

కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అంచనా ప్రకారం 2023లో భారతదేశం తన మొత్తం అసెంబుల్డ్ మొబైల్ ఫోన్‌లలో దాదాపు 22శాతం ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉంది. మొబైల్ రంగంలో సుదీర్ఘ కాలంగా చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇండియా వరల్డ్ టాప్ 2లో రావడం ఇది ఒక హెచ్చరిక అని సీనియర్ రీసెర్చ్, అనలిస్ట్ లు చెపుతున్నారు. 

2024 ఫైనాన్సియల్ ఇయర్ లో ఏప్రిల్- ఆగస్టు కాలంలో 5.5 బిలియన్ డాలర్లు( రూ. 45వేల కోట్లు) విలువైన మొబైల్ ఫోన్ల ఎగుమతి జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల డేటాను విడుదల చేసింది. ఇది 22 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 3 బిలియన్ డాటర్ల( రూ. 25వేల కోట్లు)తో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల.  ఇది మేకిన్ ఇండియా చొరవకు గణనీయమైన ప్రోత్సాహాన్ని నిస్తుందంటున్నారు నిపుణులు. 

భారతదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ ఎగుమతుల్లో రూ.1,20,000 కోట్లను అధిగమించేందుకు ట్రాక్‌లో ఉంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ మార్కెట్ వాటాలో 50కంటే ఎక్కువ ఆధిక్యతతో Apple ముందుంది.

అయితే ఈ ఏడాది ప్రథమార్థంలో ఒరిజినల్ డిజైన్ తయారీదారులు (ODMలు)..ఇండిపెండెంట్ డిజైన్ హౌస్‌ల (IDHలు) నుంచి స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లలో సంవత్సరానికి ఆరు శాతం క్షీణత ఉందని  నివేదికలు చెబుతున్నాయి. దీనికి కారణం ప్రధానంగా Samsung, Xiaomi , Lenovo గ్రూప్ వంటి సంస్థల బలహీనమైన పనితీరు అని తెలుస్తోంది. అయినప్పటికీ Vivo, HONOR , Transsion Group పెరుగుదల ఈ క్షీణతను పాక్షికంగా భర్తీ చేసిందని నివేదికలు చెపుతున్నాయి. 

గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ ODM/IDH పరిశ్రమలో బిగ్ 3 గా పిలువబడే హువాకిన్, లాంగ్‌చీర్ , వింగ్‌టెక్ 2023 ఫైనాన్షియల్ ఇయర్ మొదటి అర్ధభాగంలో మార్కెట్ వాటాలో 76శాతం వాటాను కలిగి అగ్రస్థానంలో ఉన్నాయి. 

Also Read :- 5 నెలల కనిష్టానికి ..మాన్యుఫాక్చరింగ్ ​రంగం

2023 మొదటి అర్ధభాగంలో అవుట్‌సోర్స్ డిజైన్ షిప్‌మెంట్‌లు తగ్గాయి. అయితే అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే వారి వాటా పెరిగింది.మొదటి ఆరు ODMలు మొత్తం ODM షిప్‌మెంట్‌లలో 95శాతం వాటాను కలిగి ఉండి మార్కెట్‌లో గణనీయమైన ఉనికిని కనబర్చుతున్నాయి. 

మొబైల్ ఫోన్ తయారీలో పెరుగుతున్న భారత్ ప్రాముఖ్యత.. దేశీయ ఉత్పత్తి ,ఎగుమతులను పెంచడానికి దేశం ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ తయారీ కేంద్రంగా  మారాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోంది.