చెలరేగిన ఇషాన్‌, శ్రేయ‌స్‌.. టీమిండియా భారీ స్కోర్‌

లక్నో: శ్రీలంకతో జరుగుతున్న ఫస్ట్ టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 రన్స్ చేసింది.  ఇషాన్ కిష‌న్ (56 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), ఆఖ‌ర్లో శ్రేయ‌స్ అయ్య‌ర్ (28 బంతుల్లో 57; 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లంక బౌల‌ర్ల‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఈ ఇద్ద‌రికి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (32 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స‌ర్ సాయంతో 44) తోడ‌వ్వ‌డంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది.  లంక బౌల‌ర్ల‌లో కుమార, ష‌న‌క త‌లో వికెట్ ద‌క్కించుకున్నారు.