సిరియా నుంచి 75 మంది రాక.. సురక్షితంగా తీసుకొచ్చిన కేంద్రం

సిరియా నుంచి 75 మంది రాక.. సురక్షితంగా తీసుకొచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: తిరుగుబాటుదారుల అధీనంలోకి వెళ్లిన సిరియాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దీంతో అక్కడ ఉన్న ఇండియన్లను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో తాజాగా 75 మంది ఇండియన్‌‌‌‌‌‌‌‌ సిటిజన్లను సిరియా నుంచి భారత్‌‌‌‌‌కు తరలించింది. ప్రస్తుతం సిరియాలో ఉన్న దారుణ పరిస్థితులను ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని ఘజియాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన రవి భూషణ్‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తి వివరించాడు.

బిజినెస్‌‌‌‌‌‌‌‌ పని మీద సిరియా వెళ్లిన ఆయన అక్కడ చిక్కుకుపోయాడు. దీంతో ఇండియన్‌‌‌‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌‌‌‌ అతడితో పాటు 75 మందిని సురక్షితంగా స్వదేశానికి తరలించింది. సిరియాలో పరిస్థితులపై అక్కడున్న ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఎంబసీకి రవి భూషణ్‌ ఎప్పటికప్పుడు తెలియపర్చాడు. సహాయం చేయాలని కోరాడు. దీంతో భయపడాల్సిన పని లేదని, ఇండియన్లను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తమకు ధైర్యం చెప్పారని వెల్లడించారు.