డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోతగ్గిన ఎగుమతులు

న్యూఢిల్లీ: ఇండియా ఎగుమతులు వరుసగా రెండో నెలైన డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ తగ్గాయి. కిందటి నెలలో ఇండియా నుంచి 38.01 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు, సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు  ఎగుమతి అయ్యాయి. అంతకు ముందు ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఒక శాతం తగ్గాయి.   దిగుమతులు  ఏడాది ప్రాతిపదికన 5 శాతం పెరిగి 59.95 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.    ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డెఫిసిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (దిగుమతులు, ఎగుమతుల మధ్య తేడా) 21.94 బిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాలర్లకు చేరుకుంది.

 కిందటేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– డిసెంబర్ మధ్య ఇండియా మొత్తం ఎగుమతులు 321.71 బిలియన్ డాలర్లకు చేరుకోగా, అంతకుముందు ఏడాది ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 1.6 శాతం గ్రోత్ నమోదు అయ్యింది. దిగుమతులు కూడా 5 శాతం పెరిగి 532.48 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. ట్రేడ్ డెఫిసిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  189.74 బిలియన్ డాలర్ల నుంచి 210.77 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఎగుమతులను పెంచేందుకు   20 దేశాలతో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. ఇండియా ఎగుమతుల్లో 60 శాతం ఈ దేశాలకే జరుగుతోంది.