రాజ్‌కోట్: వన్డే వరల్డ్‌కప్ ప్రిపరేషన్స్‌కు ఘనమైన ముగింపు ఇచ్చేందుకు ఇండియా రెడీ అయ్యింది. ఇందులో భాగంగా బుధవారం జరిగే మూడో వన్డేలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే 2–0తో సొంతం చేసుకున్న హోమ్ టీమ్ ఈ మ్యాచ్ కూడా గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇదే జరిగితే.. ఇండియన్ క్రికెట్‌లో ఆసీస్‌ను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా టీమిండియా అరుదైన ఘనతను సొంతం చేసుకుంటుంది.
ఈ మ్యాచ్ కోసం టాప్ ప్లేయర్లు కెప్టెన్ రోహిత్, విరాట్ టీమ్‌లోకి వచ్చేశారు. అయితే వరల్డ్ కప్ దృష్ట్యా గిల్, శార్దూల్, షమీ, పాండ్యాకు రెస్ట్ ఇచ్చారు. దీంతో 13 మందితోనే టీమిండియా రాజ్‌కోట్ చేరుకుంది. గాయంతో అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‌కు కూడా అందుబాటులో లేడు. దీంతో వరల్డ్ కప్‌లో కూడా అతను ఆడటంపై సందేహాలు కొనసాగుతున్నాయి.