
బెంగళూరు: తొలి మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన ఇండియా విమెన్స్ టీమ్.. సౌతాఫ్రికాతో రెండో వన్డేకు రెడీ అయ్యింది. బుధవారం జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ఇక్కడే పట్టేయాలని భావిస్తోంది. అయితే ఇది జరగాలంటే టాపార్డర్ బ్యాటర్లందరూ ఫామ్‌లోకి రావాల్సి ఉంది. తొలి మ్యాచ్‌లో మంధాన సెంచరీకి తోడు స్పిన్నర్లు మాత్రమే మెరుగ్గా ఆడారు. ఈ నేపథ్యంలో మిగతా బ్యాటర్లు రాణించాల్సి ఉంది. షెఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్, జెమీమా రొడ్రిగ్స్ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. ఇక తొలి వన్డేలో ఓడిన సౌతాఫ్రికా లెక్క సరిచేయాలని పట్టుదలగా ఉంది. ఇది జరగాలంటే ప్రొటీస్ బ్యాటర్లందరూ శక్తికి మించి శ్రమించాలి.