AUS vs IND: మనోళ్లకు రెస్ట్ లేదు.. ఆస్ట్రేలియాకు అనుకూలంగా సెమీస్ ఫైట్

AUS vs IND: మనోళ్లకు రెస్ట్ లేదు.. ఆస్ట్రేలియాకు అనుకూలంగా సెమీస్ ఫైట్

ప్రస్తుతం క్రికెట్ ప్రేమికుల దృష్టి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ పైనే ఉంది. ఇప్పటివరకు ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి మరో లెక్క అనేలా టోర్నీపై భారీ హైప్ నెలకొంది. దుబాయ్ వేదికగా మంగళవారం (మార్చి 4) జరగనున్న ఈ మెగా ఫైట్ లో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. భారత్ పై ఐసీసీ రికార్డ్స్ లో ఆస్ట్రేలియా బలంగా ఉన్నప్పటికీ ఈ సెమీస్ ఫైట్ భారత్ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఒక్క విషయం మాత్రం రోహిత్ సేనకు ప్రతికూలంగా మారింది. 

న్యూజిలాండ్ తో దుబాయ్ వేదికగా ఆదివారం (మార్చి 2) భారత్ మ్యాచ్ ఆడింది. 44 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ లో గెలిచి టేబుల్ టాపర్ గా  సెమీ ఫైనల్ కు చేరింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు భారత క్రికెటర్లకు రెస్ట్ లేదు. సెమీ ఫైనల్ కు ఒక రోజే గ్యాప్ ఉండడంతో మన క్రికెటర్లు రెస్ట్ తీసుకోకుండానే ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. దీంతో భారత క్రికెటర్లు కాస్త అలసటకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ విషయం ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టుకు కలిసి రానుంది. శుక్రవారం (ఫిబ్రవరి 28)  ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ రద్దు చేసుకున్న ఆస్ట్రేలియాకు సెమీస్ కు ముందు నాలుగు రోజుల గ్యాప్ దొరికింది. 

శనివారం దుబాయ్ చేరుకున్న ఆసీస్ సెమీస్ ఫైట్ కు తాజాగా బరిలోకి దిగనుంది. బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్ వెల్ పై ఆస్ట్రేలియా భారీ ఆశలే పెట్టుకుంది. దుబాయ్ పిచ్ పై ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా మ్యాచ్ ఆడడం ఇదే తొలిసారి. ఈ విషయం కంగారూల జట్టును కలవరానికి గురి చేస్తుంది. మరోవైపు భారత్ ఇప్పటికే అక్కడ పరిస్థితులను అలవాటు చేసుకుంది. ఓవరాల్ గా ఒత్తిడిని తట్టుకొని ఎవరు గెలిచి ఫైనల్ కు వెళ్తారో ఆసక్తికరంగా మారింది.