CSpace: ఇండియా ఫస్ట్ గవర్నమెంట్ ఓటీటీ

ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ లవర్స్ కోసం ఎన్నో ఓటీటీ యాప్స్ రెడీగా ఉన్నాయి. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ  థియేటర్ల కంటే ఓటీటీపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అందుకే కేరళ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. సొంతంగా ఓ ఓటీటీ యాప్‌ను రిలీజ్ చేసింది. ఈరోజు CSpace అనే ఓటీటీ ప్లాట్ ఫాంను కేరళ సీఎం పినరైయ్ విజయ్ కుమార్ ప్రారంభించారు. 

ALSO READ :- బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నందుకే రాజీనామా చేశాం: బీఆర్ఎస్ నాయకులు

దేశంలోనే తొలి ప్రభుత్వ రంగ ఓటీటీ అయిన సీస్పేస్ ను కేర‌ళ స్టేట్ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (కేఎస్ఎఫ్‌డీసీ) సీస్పేస్ ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ స‌హ‌కారంతో ఓటీటీ ప్లాట్‌ఫాం సీస్పేస్ నడుస్తోంది. సీస్పేస్ పే ఫ‌ర్ వ్యూ మోడ‌ల్‌పై సినిమాకు యూజ‌ర్ల నుంచి రూ. 75 వ‌సూలు చేస్తుంది. 60 మంది క్యూరేట‌ర్ల ప్యానెల్ సమక్షంలో  సీస్పేస్ ప్రోగ్రామ్స్ నడుస్తాయి.