న్యూఢిల్లీ: దేశ ఫారెక్స్ నిల్వలు ఈ నెల 18 తో ముగిసిన వారంలో 2.163 బిలియన్ డాలర్లు తగ్గి 688.267 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. అంతకు ముందు వారంలో 10.746 బిలియన్ డాలర్లు తగ్గి 690.43 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. కిందటి నెల 30 నాటికి ఫారెక్స్ నిల్వలు 704.885 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఈ నెల 18 తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ నిల్వలు 3.865 బిలియన్ డాలర్లు తగ్గి 598.236 బిలియన్ డాలర్లకు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్) 68 మిలియన్ డాలర్లు తగ్గి 18.271 బిలియన్ డాలర్లకు తగ్గాయి. గోల్డ్ రిజర్వ్‌లు మాత్రం 1.786 బిలియన్ డాలర్లు పెరిగి 67.444 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.