న్యూఢిల్లీ: ఇండియా రియల్ జీడీపీ లెక్కలను కొలిచేందుకు ఇక నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరాన్ని బేస్ ఇయర్‌గా పరిగణించనున్నారు. బేస్ ఇయర్‌ను 2011–12 నుంచి 2022–23 కు అప్‌డేట్ చేయాలని నిర్ణయించామని స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ రాజ్యసభలో పేర్కొన్నారు.
జీడీపీని లెక్కించేటప్పుడు 2022–23 ఆర్థిక సంవత్సరంలోని ధరలను పరిగణనలోకి తీసుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రిజర్వ్ బ్యాంక్ ప్రతినిధులు, నిపుణులతో కూడిన అడ్వైజరీ కమిటీ ఏసీఎన్‌ఏఎస్ బేస్ ఇయర్ మార్చడంపై రికమండేషన్స్ ఇచ్చిందని ఇంద్రజిత్ సింగ్ తెలిపారు.