నేపాల్​కు 84 వెహికల్స్ గిఫ్టిచ్చిన భారత్

కాఠ్మండు: నేపాల్​లోని పలు ఆస్పత్రులు, విద్యాసంస్థలకు భారత ప్రభుత్వం 84 వాహనాలను అందజేసింది. గిఫ్ట్​గా అందించిన ఈ వాహనాలలో.. 34 అంబులెన్స్​లు, 50 స్కూల్​ బస్సులు ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు వీటిని ఉపయోగించుకుంటాయని ఆ దేశంలోని మన ఎంబసీ పేర్కొంది. నేపాల్ మంత్రి అశోక్​ కుమార్ రాయ్ సమక్షంలో భారత రాయబారి నవీన్​ శ్రీవాస్తవ ఈ వెహికల్స్​ను ఆయా సంస్థలకు అందజేశారు. 

ALSO READ :రికార్డు స్థాయికి క్రెడిట్​కార్డుల వాడకం

నేపాల్, ఇండియా డెవలప్​మెంట్​ పార్టనర్​షిప్​ ప్రోగ్రామ్​లో భాగంగా వెహికల్స్ అందజేసినట్లు శ్రీవాస్తవ చెప్పారు. విద్య, ఆరోగ్య రంగాల్లో మౌలిక వసతుల బలోపేతానికి నేపాల్​ ప్రభుత్వం చేస్తున్న కృషికి మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులపై నేపాల్​ మంత్రి ​రాయ్ హర్షం వ్యక్తం చేశారు.