గోల్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిక్సర్ హై జంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రవీణ్‌‌ కుమార్‌‌‌‌కు స్వర్ణం

గోల్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిక్సర్ హై జంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రవీణ్‌‌ కుమార్‌‌‌‌కు స్వర్ణం

పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు ఆరో స్వర్ణ పతకం లభించింది. శుక్రవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హై జంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీ64 ఫైనల్లో ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2.08 మీటర్లతో  ఆసియా రికార్డు బ్రేక్ చేస్తూ  టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బంగారు పతకం సాధించాడు. నోయిడాకు చెందిన 21 ఏండ్ల ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోక్యో పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెరిశాడు. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1.89 మీటర్ల ఎత్తును క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాతి ప్రయత్నాల్లో క్రమంగా పెంచుకుంటూ వెళ్లాడు. అయితే చివర్లో 2.10 మీటర్ల ఎత్తును క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేక 2.08తోనే ఆగిపోయాడు.

 అయినా ఆసియా రికార్డును బద్దలు కొట్టాడు.  ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన డెరెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోక్సిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (అమెరికా, 2.06 మీటర్లు) సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పరిమితం కాగా, టెమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్బెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గయజోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2.03 మీ.) బ్రాంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇదే అత్యుత్తమ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం. పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హై జంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. 

మరియప్పన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తంగవేలు రియోలో తొలి గోల్డ్ అందుకున్నాడు. కాగా, పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హై జంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు ఇది మూడో పతకం. శరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రజతం, తంగవేలు కాంస్యం నెగ్గారు. పుట్టుకతోనే ఓ కాలు చిన్నదిగా ఉండటంతో ఎక్కువగా ఆత్మనూన్యతా భావంతో ఉండే ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాన్ని మర్చిపోయేందుకు క్రీడల వైపు మళ్లాడు. ఆరంభంలో వాలీబాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడినా, పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్యపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచన మేరకు హై జంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎంచుకున్నాడు. 

2019 స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పారా జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2021 దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రి ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్వర్ణం గెలిచి ఒక్కసారిగా పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన ముద్రను వేశాడు. కాగా, మెగా ఈవెంట్‌‌లో ఇండియా ఆరు స్వర్ణాలు, 9రజతాలు, 11 కాంస్యాలు సహా 26 పతకాలతో 15వ స్థానంలో కొనసాగుతోంది. 

జావెలిన్‌‌లో నిరాశ

మెన్స్‌‌ జావెలిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్రో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 54లో దీపేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఖరి ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకున్నాడు. ఏడుగురు పోటీపడ్డ ఫైనల్లో దీపేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జావెలిన్‌‌ను 26.11 మీటర్ల దూరం విసిరాడు. విమెన్స్‌‌ఎఫ్‌‌46 విభాగంలో భావనబెన్ చౌదరి మూడో ప్రయత్నంలో అత్యధికంగా 39.70 మీటర్లతో ఐదో స్థానంతో సరిపెట్టింది.  ఇండియా కనోయి స్ప్రింటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాచీ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించారు. 

విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2, 200 మీటర్ల హీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1లో ప్రాచీ 1:06.83 సెకన్లతో, పూజా 1:16.09 సెకన్లతో నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచారు. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1, 200 మీటర్ల హీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2లో యష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమరా 1:03.27 సెకన్ల టైమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆరో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 67 కేజీల పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాజమణి కస్తూరి ఎనిమిదో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచి నిరాశ పరిచింది. రెండో ప్రయత్నంలో ఆమె 106 కేజీల బరువు ఎత్తింది. చివరిదైన మూడో ప్రయత్నంలో 110 కేజీల బరువు ఎత్తడంలో విఫలమైంది. 

ఫ్లాగ్ బేరర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా హర్వీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రీతి

ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్వీదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్ప్రింటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రీతి పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఆదివారం రాత్రి జరిగే పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగింపు కార్యక్ర మంలో ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేరర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించను న్నారు. ఈ కార్యక్రమంలో దేశ జెండాను మోయడం తనకు దక్కిన అత్యున్నత గౌరవమని హర్విందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నాడు. ‘ఇండియా తరఫున స్వర్ణం గెలవాలన్న నా కల నిజమైంది. ఇప్పుడు త్రివర్ణం మోసే బాధ్యత దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు లభించిన అతిపెద్ద గౌరవం. ఈ విజయం నాతో పాటు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నా’ అని హర్విందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. ఈ విషయం విని చాలా సంతోషంగా ఫీలయ్యానని ప్రీతి వెల్లడించింది. 

ఫైనల్లో సిమ్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 200 మీటర్ల టీ12 ఈవెంట్‌‌లో  సిమ్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ ఫైనల్‌‌ చేరుకుంది. సెమీఫైనల్లో సిమ్రన్ 25.15 సెకన్లలో టార్గెట్‌‌ను చేరుకుంది. ఓవరాల్‌‌గా మూడో ప్లేస్‌‌తో ఫైనల్‌‌కు అర్హత సాధించింది. అంతకుముందు  హీట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–5లో 25.41 సెకన్లలో లక్ష్యాన్ని చేరి టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచింది.