బిలియనీర్లలో ఇండియాది మూడోప్లేస్​

బిలియనీర్లలో ఇండియాది మూడోప్లేస్​
  • దేశంలో పైసలున్నోళ్లు పెరుగుతున్రు
  • ఈక్విటీ, డిజిటల్ జోరే కారణం
  • ఇండ్లపై ఇన్వెస్ట్​మెంట్​ ఇష్టం
  • బిలియనీర్లలో ఇండియాది మూడోప్లేస్​
  • నైట్​ఫ్రాంక్​ వెల్త్​ రిపోర్టు 2022 వెల్లడి

వెలుగు, బిజినెస్​ డెస్క్​: మన దేశంలో బాగా డబ్బున్నోళ్లు ఇండ్ల మీద పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. దేశంలో రూ. 226 కోట్లకి మించి నెట్​వర్త్​ ఉన్న వారిలో 30 శాతం మంది ఇండ్లు కొనడానికి మొగ్గు చూపుతున్నట్లు నైట్​ఫ్రాంక్​ వెల్త్​రిపోర్ట్​ 2022 వెల్లడించింది. బాగా డబ్బున్నోళ్ల (అల్ట్రా హై నెట్​వర్త్​ ఇండివిడ్యువల్స్​) సంఖ్య కిందటేడాది 11 శాతం పెరిగినట్లు పేర్కొంది. ఈక్విటీ మార్కెట్ల జోరు, డిజిటల్​ రివల్యూషన్​ వల్లే సంపన్నులు పెరిగారని తెలిపింది. గ్లోబల్​గా బిలియనీర్లు ఎక్కువగా ఉన్న దేశాలలో ఇప్పుడు మన దేశం మూడో ప్లేస్​లో నిలుస్తోంది. 748 మంది బిలియనీర్లతో అమెరికా మొదటి ప్లేస్​లోనూ, 554 మంది ర్లతో చైనా రెండో ప్లేస్​లోనూ ఉండగా, 145 మంది బిలియనీర్లతో మన దేశం మూడో ప్లేస్​లో ఉంది. అల్ట్రా హై నెట్​వర్త్​ ఇండివిడ్యువల్స్​ 2021 లో ఆసియా పసిఫిక్​ ప్రాంతంలో మరే దేశంలోనూ లేని విధంగా 11 శాతం పెరిగారని నైట్​ఫ్రాంక్​ రిపోర్టు వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఇలాంటి సంపన్నులు దేశంలో 12,287 మంది అయితే, 2021లో ఆ సంఖ్య 13,637 కి చేరింది. సంపద ఎక్కువైన వారిలో 30 శాతం మంది ఇండ్లు కొనడానికి ఇష్టపడుతున్నారని, ఒక ఇల్లు ఉంటే మరో ఇల్లు కొనడానికీ సిద్ధపడుతున్నారని నైట్​ఫ్రాంట్​ ఈ రిపోర్టులో విశ్లేషించింది.

సూపర్​పవర్​గా ఇండియా....
అల్ట్రా హై నెట్​ వర్త్ ఇండివిడ్యువల్స్​, బిలియనీర్లు బాగా పెరుగుతుండటంతో గ్లోబల్​గా ​అధిక గ్రోత్​ సాధించే దేశాలలో మన దేశం ముందుంటుందని కూడా శిశిర్​ బైజాల్​ ఈ రిపోర్టులో పేర్కొన్నారు. వివిధ సెక్టార్లలో లీడర్​గా మారడంతో పాటు, దేశం సూపర్​ పవర్​గా మారుతుందని అన్నారు. దేశంలోని 69 శాతం మంది  సంపన్నుల సంపద 2022లో 10 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఈ రిపోర్టు పేర్కొంది. బిలియనీర్ల క్లబ్​లో ఎక్కువ మందితో ఆసియా ముందుంది. 2021 లోని  కొత్త బిలియనీర్లలో 36 శాతం మంది ఆసియా ప్రాంతం నుంచే రావడం విశేషమని నైట్​ఫ్రాంక్​ రిపోర్టు తెలిపింది. కొత్తగా బిలియనీర్లుగా మారుతున్న వారితో భవిష్యత్తులో ప్రోపర్టీ మార్కెట్​ ఎలా మారుతుందనే అంశాన్నీ నైట్​ఫ్రాంక్​ ఈ ఏడాది రిపోర్టులో విశ్లేషించింది. ఇలా విశ్లేషించడం ఇదే మొదటిసారి. 

సొంతంగా ఎదిగినోళ్లు ఎక్కువే.....
గ్లోబల్​గా చూస్తే, 1,35,192 మంది  సొంతంగా బిలియనీర్లుగా ఎదిగారని, వీరి వయసు 40 ఏళ్ల లోపేనని నైట్​ ఫ్రాంక్​ రిపోర్టు తెలిపింది. ప్రపంచంలోని మొత్తం  అల్ట్రా హై నెట్​వర్త్​ ఇండివిడ్యువల్స్​లో ఇది అయిదో వంతుకు సమానమని పేర్కొంది. రాబోయే అయిదేళ్లలో గ్లోబల్​గా అల్ట్రా హై నెట్​వర్త్​ ఇండివిడ్యువల్స్​ సంఖ్య 28 శాతం చొప్పున పెరుగుతుందని, ఇందులో ఆసియా–ఆస్ట్రేలియా ప్రాంతాల నుంచి 33 శాతం, నార్త్​ అమెరికా నుంచి 28 శాతం, లాటిన్​ అమెరికా నుంచి 26 శాతం మంది ఉంటారని అంచనా వేసింది. కిందటి అయిదేళ్ల కాలం చూస్తే ఢిల్లీలోని అల్ట్రా హై నెట్​వర్త్​ ఇండివిడ్యువల్స్​ సంఖ్య 101.2 శాతం, ముంబైలో 42.6 శాతం, బెంగళూరులో 22.7 శాతం పెరిగిందని, కానీ రాబోయే అయిదేళ్లలో ఈ అంశంలో బెంగళూరు ముందడుగు వేస్తుందని నైట్​ ఫ్రాంక్​ రిపోర్టు తెలిపింది. ఈ సిటీలో అల్ట్రా హై నెట్​వర్త్​ ఇండివిడ్యువల్స్​సంఖ్య 89 శాతం గ్రోత్​తో  2026 నాటికి 665 కి 
చేరుతుందని నైట్​ఫ్రాంక్​ ఇండియా రిపోర్టు పేర్కొంది.

బెంగళూరు నుంచే ఎక్కువ మంది
బెంగళూరు సిటీలో కిందటేడాది ఎక్కువ డబ్బున్నోళ్ల సంఖ్య ఎక్కువగా పెరిగింది. ఈ సిటీలోని అల్ట్రా హై నెట్​వర్త్​ ఇండివిడ్యువల్స్​ సంఖ్య 17.1 శాతం పెరిగి 352 కి చేరింది. ఆ తర్వాత రెండు ప్లేస్​లలో 12.4 శాతం గ్రోత్​తో ఢిల్లీ (210)  9 శాతం గ్రోత్​తో ముంబై (1,596) నిలిచాయి.  2026 దాకా ఈ అల్ట్రా హై నెట్​వర్త్​ ఇండివిడ్యువల్స్​ సంఖ్య ఏటా 39 శాతం చొప్పున పెరుగుతుందని నైట్​ఫ్రాంట్​ రిపోర్టు అంచనా వేస్తోంది. అప్పటికి వారి సంఖ్య 19,006కి చేరనుంది. 2016 నాటికి దేశంలోని అల్ట్రా హై నెట్​వర్త్​ ఇండివిడ్యువల్స్​ సంఖ్య 7,401 మాత్రమే.

ఈక్విటీ మార్కెట్ల జోరు, డిజిటల్​ టెక్నాలజీల అడాప్షన్​లు దేశంలోని అల్ట్రా హై నెట్​వర్త్​ఇండివిడ్యువల్స్​ ఎక్కువవడానికి కారణాలు. సొంతంగా సంపన్నులగా ఎదుగుతున్న యువతీ, యువకుల సంఖ్య దేశంలో బాగా పెరుగుతోంది. ఇలా ఎదిగిన వారు తమ పెట్టుబడులతో ఇనొవేషన్​ తీసుకు వచ్చే ఛాన్స్​ ఉంటుంది. 
- శిశిర్​ బైజాల్​, ఛైర్మన్​, నైట్​ఫ్రాంక్​ ఇండియా