
సెయింట్ లూసియా : ఇండియా గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్.. సింక్‌ఫీల్డ్ చెస్ టోర్నీలో మరో డ్రాతో గట్టెక్కాడు. లోకల్ ఫేవరెట్ ఫ్యాబియానో కరువాన (అమెరికా)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో డ్రాతో బయటపడ్డాడు. స్టార్టింగ్ నుంచి గుకేశ్ దూకుడుగా వ్యవహరించినా.. 39వ ఎత్తు వద్ద కరువాన చిన్న తప్పిదం చేయడంతో గుకేశ్‌కు డ్రా చేసుకునే చాన్స్ దక్కింది. ఇయాన్ నెపోమినెట్చి (రష్యా, 2.5)తో జరిగిన మరో గేమ్‌ను ఆర్. ప్రజ్ఞానంద డ్రాగా ముగించాడు.
ఈ రౌండ్ తర్వాత గుకేశ్ గుకేశ్, ప్రజ్ఞానంద చెరో మూడున్నర పాయింట్లతో ఉన్నారు. ఇతర గేమ్‌ల్లో అలిరెజా ఫిరౌజ (ఫ్రాన్స్, 5).. డింగ్ లిరెన్ (చైనా, 3)పై, అబ్దుసత్తారోవ్ (ఉజ్బెకిస్తాన్, 3.5).. వెస్లీ సో (అమెరికా, 3.5)పై గెలవగా, వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్, 3.5).. అనిశ్ గిరీ (నెదర్లాండ్స్, 2.5) మధ్య జరిగిన గేమ్ డ్రా అయ్యింది.